తెలంగాణలో కొత్తగా 40 పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. కొత్తగా ఇవాళ రాష్ట్రంలో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. కొత్తగా ఇవాళ రాష్ట్రంలో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం 1454 కేసులు నమోదు కాగా.. 461 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 13మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 959 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 34మంది ఈ మహమ్మరి బారిన పడి మృతి చెందారు. ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ లో 33 ఉన్నాయి.