TG Muncipal Elections Results 2026: దేవరకొండలో ఎగిరిన ‘హస్తం’ జెండా.. మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. చైర్మన్ అభ్యర్థి విజయం!

TG Muncipal Elections Results 2026: నల్గొండ జిల్లాలోని దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది.

Update: 2026-02-13 05:26 GMT

TG Muncipal Elections Results 2026: నల్గొండ జిల్లాలోని దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో 11 వార్డులను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 6 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ ఒక చోట, స్వతంత్రులు రెండు చోట్ల విజయం సాధించారు.

పార్టీల వారీగా ఫలితాలు:

కాంగ్రెస్: 11 వార్డులు

బీఆర్ఎస్: 06 వార్డులు

బీజేపీ: 01 వార్డు

ఇండిపెండెంట్: 02 వార్డులు

వార్డుల వారీగా విజేతల జాబితా:

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శైలజ వెంకటేశ్వర్లు 20వ వార్డు నుంచి 103 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం.

వార్డు 1: గుండాల పద్మ (బీజేపీ) - 300 మెజారిటీ

వార్డు 2: పొట్ట మురళి (బీఆర్ఎస్)

వార్డు 3: అంకూరి సుమలత (కాంగ్రెస్)

వార్డు 4: రయీస్ (కాంగ్రెస్)

వార్డు 5: శ్రీ కన్య (ఇండిపెండెంట్)

వార్డు 6: ఎండి యూనుస్ (కాంగ్రెస్)

వార్డు 7: సాయి చంద్ర గౌడ్ (కాంగ్రెస్)

వార్డు 8: అజయ్ చంద్ర (కాంగ్రెస్)

వార్డు 9: ముత్యాల చంద్రకళ (బీఆర్ఎస్)

వార్డు 10: గుద్దేటి మాధవి (కాంగ్రెస్)

వార్డు 11: షేక్ నవీద్ (కాంగ్రెస్)

వార్డు 12: అంకులమ్మ (కాంగ్రెస్)

వార్డు 13: పులిజాల భవాని (బీఆర్ఎస్)

వార్డు 14: గాజుల సావిత్రి (కాంగ్రెస్)

వార్డు 15: జువేరియా తబస్సుం (కాంగ్రెస్)

వార్డు 16: రూప్లా నాయక్ (బీఆర్ఎస్)

వార్డు 17: పొట్ట మధు (బీఆర్ఎస్)

వార్డు 18: అంజి గౌడ్ (బీఆర్ఎస్)

వార్డు 19: శ్రీధర్ గౌడ్ (కాంగ్రెస్ మద్దతుగల ఇండిపెండెంట్)

వార్డు 20: శైలజ వెంకటేశ్వర్లు (కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి)

దేవరకొండ మున్సిపాలిటీని గెలుచుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు నేతలు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News