TG Muncipal Elections Results 2026: తెలంగాణ మున్సిపల్ ఫలితాలు: నందికొండలో కాంగ్రెస్ ‘క్లీన్ స్వీప్’.. గడ్డపోతారంలో బీఆర్ఎస్ హవా!

TG Muncipal Elections Results: తెలంగాణలో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

Update: 2026-02-13 05:16 GMT

TG Muncipal Elections Results: తెలంగాణలో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వెలువడుతున్న ఫలితాల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. నల్గొండ మరియు సంగారెడ్డి జిల్లాల్లోని కీలక మున్సిపాలిటీల్లో ఫలితాలు స్పష్టమయ్యాయి.

నందికొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్:

నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా, ఏకంగా 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఇక్కడ కోలుకోలేని దెబ్బ తగిలింది.

గడ్డపోతారంలో బీఆర్ఎస్ జయకేతనం:

మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ (BRS) తన పట్టును నిలుపుకుంది. మొత్తం 18 వార్డులకు గాను ఫలితాలు ఇలా ఉన్నాయి:

బీఆర్ఎస్: 14 వార్డులు

కాంగ్రెస్: 03 వార్డులు

స్వతంత్రులు: 01 వార్డు

గడ్డపోతారంలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పీఠాన్ని దక్కించుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మున్సిపాలిటీల ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

Full View


Tags:    

Similar News