Fish Prasadam Distribution: నేడు చేప ప్రసాదం పంపిణీ..నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి

Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది.

Update: 2025-06-08 01:56 GMT

Fish Prasadam Distribution: నేడు చేప ప్రసాదం పంపిణీ..నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి

Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం, సోమవారాల్లో పంపిణీ చేయనున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు క్యూలైన్స్ కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు పారిశుధ్యంతోపాటు మొబైల్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. మంచి నీటి సరఫరాకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది 42 క్యూలైన్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు గాను అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలను చేపట్టింది. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ద్వారా లక్షకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. అవసరాలను బట్టి మైదానానికి తరలించేందుకు గాను ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. చేప ప్రసాదం కోసం సమయనసారంగా ప్రత్యేక టోకెన్లు ఇవ్వనున్నట్లు మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక క్యలైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.

కాగా ఆదివారం ఉదయం 9గంటలకు మృగశిర కార్తె ప్రవేశిస్తుండటంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభిస్తారని..టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News