టిక్‌టాక్ డ్రగ్‌లా మారింది. యువతే కాదు ప్రభుత్యోగులు మత్తులో చిత్తువుతున్నారు. మ్యూజికల్ వీడియోస్, డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్‌తో తమలోనే టాలెంట్‌ను బయటతీస్తున్నారు. అదిరిపోయే రేంజ్లో డైలాగ్స్ చెబుతూ ఇరగీదీస్తున్నారు. మొన్న ఖమ్మం, నిన్న హైదరాబాద్ , ఇవాళ మహబూబాబాద్‌లో ప్రభుత్వోగులు టిక్‌టాక్ ఉచ్చులో పడి ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకున్నారు.
మహబూబాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విద్యాసాగర్ జంగిలిగొండ గ్రామ వీఆర్ఎ. పట్టాల కోసం రైతులు చెప్పులు అరిగేలా తిరుగుతుంటే ఇతగాడు మాత్రం టిక్‌టాక్‌లో మునిగిపోయాడు. పనిని పక్కన పెట్టి గూప్రుల్లో పంచ్డైలాగ్స్ను పోస్ట్ చేయడంతో పై అధికారులు పైరయ్యారు. జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశాలో సదరు ఉద్యొగిని సస్పెండ్ చేశారు. వీడియో మూలంగానే సస్పెండ్ చేసినట్టు తహసీల్దార్ రంజిత్ కుమార్ తెలిపారు.