కుమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం.. నీళ్లు తాగుతుండగా వీడియో రికార్డు

Update: 2020-11-27 08:04 GMT

కుమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పెంచికల్‌పేట్‌ మండలం పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పులి దర్జాగా తిరగడం గుర్తించారు గ్రామస్తులు, రైతులు. నదిలోకి దిగి నీళ్లు తాగుతుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ప్రత్యేక సిబ్బందితో కలిసి పులి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. కేకలు, పెద్దగా శబ్దాలు చేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. గతంలో రేంజ్‌ పరిధిలో పలుమార్లు రోడ్లపై సంచరిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలున్నాయి. పలుమార్లు పశువులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో అటవీ ప్రాంతాల ప్రజలు మండల కేంద్రానికి వచ్చేందుకు జంకుతున్నారు. అగర్‌గూడ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో పులి సంచరించిన విషయం వాస్తవమేనని ఎఫ్‌ఆర్వో తెలిపారు.

Tags:    

Similar News