భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు

Bhadradri Kothagudem: తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Update: 2023-08-10 08:37 GMT

భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిడ్నాప్‌ కలకలం రేగింది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇటీవలే సన్నీ, మాధవి ప్రేమ వివాహం చేసుకోగా.. తన భార్యను ఖమ్మం నుంచి కొత్తగూడెంకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోకు అడ్డుపడ్డారు. భర్తపై దాడి చేసి భార్యను లాక్కెళ్లారు. కులాంతర వివాహం చేసుకున్నామనే కారణంతోనే.. తనపై దాడి చేసి తన భార్యను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నారు సన్నీ. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Tags:    

Similar News