ఏటీఎం చోరీకి యత్నం: దొంగలను పట్టుకున్న పోలీసులు

పట్టణాల్లో ఎక్కడ చూసినా దొంగతనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

Update: 2019-12-23 05:52 GMT

పట్టణాల్లో ఎక్కడ చూసినా దొంగతనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇండ్లలో, దుకాణాల్లో చోరీ చేయడమే కాదు ఇప్పుడు ఏటీఎంలలో కూడా చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. నిర్మాణుష్మమైన ప్రాంతంతో ఏటీఎం కనపడితే చాలు దాన్ని ఎలా కొల్లగొడదామా అన్నట్టుగానే ఆలోచిస్తుంటారు. ఇదే తరహాలో ఓ ఏటీఎంలో చోరీకి వచ్చి దుండగులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకెళితే హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమాలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫలక్‌నుమాలోని సిండికేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో నలుగురు దుండగులు చోరీకి ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు చోరీకి పాల్పడుతున్న వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల్లో మొబిన్‌, సాజిద్‌, షేక్‌ ఖాసీం ఉన్నారు. ప్రస్తుతం చోరీకి పాల్పడిన దుండగుల్లో ముగ్గురు గతంలో నిజాం మ్యూజియంలో దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. దుండగులపై గతంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News