ధర్మాజిపేట గ్రామం పెద్దమ్మ ఆలయంలో చోరీ

మున్సిపల్ పరిధి దర్మాజిపేట వార్డులో పెద్దమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు రాత్రి చోరీకి పాల్పడ్డారు.

Update: 2019-12-13 07:15 GMT
ఎస్సై మన్నె స్వామి

దుబ్బాక: మున్సిపల్ పరిధి దర్మాజిపేట వార్డులో పెద్దమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు రాత్రి చోరీకి పాల్పడ్డారు. తాళం పగులగొట్టి గుడిలోకి చొరబడి పెద్దమ్మ విగ్రహం మెడలో ఉండే అర్ధ తులం బంగారు ఆభరణాలు దోచుకెల్లారు. ఆలయంలోని వస్తువులు చిందరవందరగా చేసి గల్లాపెట్టె ఆలయ బయట పడేసి వెళ్లారు. గల్లాపెట్టె లోని నగదు అపహరించారు. రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలో మధ్యం సేవించి ఖాళీ బాటిల్స్ సైతం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

మధ్యానికి బానిసై తాగిన మత్తులో జేబు కాళీ చేసుకుని, మళ్లీ తాగడానికి డబ్బులు లేకపోవడంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజు ఆలయ ప్రాంగణంలో మధ్యం సేవించి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, అలాగే గ్రామంలో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, వాటిని అరికట్టాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చోరీకి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు దుబ్బాక ఎస్సై మన్నె స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు.

Tags:    

Similar News