Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్..
Sitarama Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ చేపట్టారు.
Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్..
Sitarama Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ చేపట్టారు. అర్థరాత్రి 12 గంటలకు అశ్వాపురం మండలం బీ.జీ. కొత్తూరు వద్ద ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రైల్ రన్ చేశారు. ట్రయల్ రన్ పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పరిశీలించనున్నారు. సీతారామాప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్య శ్యామలం కానున్నది. ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ కు పారేలా యుద్ద ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి.
ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలో పర్యటనించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్ లో గోదావరి వరదలపై అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొననున్నారు.