Beer Price Hike: మందు బాబులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన మద్యం ధరలు

Update: 2025-02-11 00:39 GMT

Beer Price Hike: మందు బాబులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన మద్యం ధరలు

Beer Price Hike: మందుబాబులకు బిగ్ షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బీర్ల ధరలను 15శాతం పెంచుకోవచ్చని తెలుపుతూ ఫైల్ పై సంతకం పెట్టింది. అంతేకాదు ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చేశాయి. నిజానికి ధరల పెంపు విషయంలో ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచేదేలేదు అని పట్టుపట్టింది. కింగ్ ఫిషర్ బీర్ల విషయంలోనూ పెద్ద గొడవే జరిగింది. కానీ ప్రభుత్వం విచిత్రమైన లాజిక్ చెప్పుకుంది. పక్క రాష్ట్రాల్లో బీర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేసింది.

నిజానికి పక్క రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉంటే అది తెలంగాణకే మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు తెలంగాణకు వచ్చి బీర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో సేల్స్ పెరుగుతాయి. కానీ ప్రభుత్వం ఆవిధంగా ఆలోచించలేదు. వాళ్లు పెంచారు కాబట్టి మనం కూడా పెంచాలనుకుంది. మరి మందుబాబులు నష్టపోతారు. వాళ్ల జేబులుకు మరిన్ని జిల్లులు పడతాయని అనుకోలేదు.

ఇక బీర్ 15శాతం పెరగడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇది బేసిక్ ధరపై 15శాతం పెంపు. దీనికి అదనంగా దాదాపు రూ. 280 దాకా వ్యాట్, ఎక్సైజ్ టాక్స్ వంటి పన్నులు కూడా కలుస్తాయి.ఇప్పటి వరకు 150 రూపాయలు ఉన్న లైట్ బీర్ ఇక నుంచి 180 రూపాయలు అవుతుంది. రూ. 160 ఉన్న స్ట్రాంగ్ బీర్ ధర నేటి నుంచి రూ. 200 అవుతుంది.

బీర్ ధరలు మాత్రమే కాదు త్వరలోనే వైన్, విస్కీ వీటి ధరలు కూడా పెంచాలనుకుంటోంది ప్రభుత్వం. బీర్ల ధర పెంచడం వల్ల ప్రభుత్వానికి రూ. 500కోట్ల నుంచి 700కోట్ల వరకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. మిగతా వాటి ధరలు కూడా పెంచితే ఆదాయం మరింత పెరుగుతుంది.

Tags:    

Similar News