Tamilisai: తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు
Tamilisai: తెలంగాణను విడిచి వెళ్లడం బాధగా ఉంది
Tamilisai: తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు
Tamilisai: తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సేవలోకి మళ్లీ వెళ్తుండటం సంతోషంగా ఉన్నా.. తెలంగాణను విడిచి వెళ్లడం బాధగా ఉందని ఆమె అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేయనున్న తమిళిసై... ఇవాళ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజల ప్రేమానురాగాలు ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. ఒక సోదరిగా ఎప్పటికీ రుణపడి ఉంటానని తమిళిసై చెప్పారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని ఆమె దాటవేశారు.