TGPSC: గ్రూప్ 1పై సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసిన TGPSC
TGPSC: టీజీపీఎస్సీ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది.
TGPSC: గ్రూప్ 1పై సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసిన TGPSC
TGPSC: టీజీపీఎస్సీ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. ఈ నెల 9న జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు నేతృత్వంలోని సింగిల్ బెంచ్ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
సింగిల్ బెంచ్ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును పూర్తిగా రద్దు చేసింది. ఈ లిస్టును రద్దు చేస్తూ, మార్కుల రివాల్యుయేషన్ లేదా అవసరమైతే తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పు వేలాది మంది అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. దీనిపై టీజీపీఎస్సీ తాజాగా డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ అంశంపై డివిజన్ బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభ్యర్థులు, నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.