TG Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల – ఫలితాల కోసం ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 16న విడుదల చేసింది.
TG Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల – ఫలితాల కోసం ఇక్కడ చెక్ చేసుకోండి
TG Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 16వ తేదీ ఉదయం 12 గంటలకు విడుదల చేసింది. మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుండి 29 వరకు నిర్వహించబడ్డాయి. అనుతీర్ణులైన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఇంటర్ బోర్డు ఈ పరీక్షలను నిర్వహించింది. ఇప్పుడు విడుదలైన ఫలితాలతో విద్యార్థులు తమ తాత్కాలిక మార్కుల మెమోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలను చెక్ చేయడానికి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అవసరం. ఎవరైనా విద్యార్థికి తన ఫలితాల్లో ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే బోర్డు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ ఫలితాల విడుదలతో ఎంతో మంది విద్యార్థుల విద్యా మార్గం తేలనుంది. ఉత్తీర్ణులైన వారు తమ తదుపరి విద్యను ప్రారంభించడానికి సిద్ధమవ్వచ్చు. ఇంకా ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు రీచెకింగ్ లేదా తదుపరి పరీక్షల కోసం సిద్ధమవ్వాల్సి ఉంటుంది.