Telangana: తెలంగాణలో పెరిగిన చలి.. మూడ్రోజులు భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు

*ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Update: 2021-12-21 01:13 GMT

తెలంగాణలో పెరిగిన చలి

Telangana: ఉత్తర, ఈశాన్య గాలులతో తెలంగాణలో చలి పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆరు డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. గతేడాది కంటే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయని టీఎస్‌ డీపీఎస్‌ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఐదు నుంచి పది డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడ్రోజుల్లో సాధారణకంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Tags:    

Similar News