TG student with Modi: తెలంగాణ విద్యార్థికి లక్కీ ఛాన్స్.. ప్రధాని మోదీ ముఖాముఖి

Update: 2025-01-17 00:35 GMT

TG student with Modi: తెలంగాణకు చెందిన విద్యార్థి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థి ప్రధాని మోదీతో ముఖాముఖీగా మాట్లాడారు. ప్రధానితో సంభాషించే ఛాన్స్ ఇచ్చినందుకు విద్యార్థి అనందం వ్యక్తం చేశారు. పరీక్షలపై మోదీతో చర్చించినట్లు విద్యార్థి తెలిపారు.

తెలంగాణలోని నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలానికి చెందిన స్టూడెంట్ అంజలి..ఈమధ్యే ఢిల్లీలో జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పరీక్షకు సంబంధిత ఒత్తిడిని తగ్గించడం, వారి విద్య ప్రయాణాలకు సహాయక వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక అంజలి ప్రస్తుతం మోడల్ స్కూల్లో ఇంటర్ రెండో ఏడాది చదువుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కలిసే అవకాశం, ఆయనతో మాట్లాడే అశకాశం లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంజలిని ఎంపిక చేసింది. అంజలి 8వ తరగతి నుంచి మోడల్ స్కూల్లో చదువుకుంటుంది.

అంజలి ప్రధాని మోదీని కలవడంపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ రాగిణి అమె గైడ్ టీచర్ సీత సంతోషం వ్యక్తం చేశారు. అంజలి సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంత గౌరవప్రదమైన కార్యక్రమంలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రాతినిధ్యం వహించినందుకు అంజలిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీని విద్యార్ధలు ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. వాటికి మోదీ సమాధానం ఇచ్చారు. ఎగ్జామ్స్ విశ్వాసంతో ఎలా ఎదుర్కొవాలో టిప్స్ చెప్పారు.

Tags:    

Similar News