TGSRTC offers: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. టికెట్ల ధరలు భారీగా తగ్గింపు
TGSRTC offers: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. టికెట్ల ధరలు భారీగా తగ్గింపు
TGSRTC offers: బస్సులో వెళ్లాలా, రైళ్లో వెళ్లాలా అని కొంతమంది ప్రయాణికులు ఆలోచిస్తుంటారు. అలాంటివారు బస్సులోనే వెళ్లండని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది. మీకోసం ఆఫర్లు కూడా ఇస్తున్నాము. ఇంతకంటే ఏం కావాలంటోంది. పక్క రాష్ట్రం ఏపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ, టికెట్ ధరలపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ల ధరలు డిస్కౌంట్ ఆఫర్ లో లభిస్తాయి. మీరు లహరి నాన్ ఏపీ బస్సుల్లో ప్రయాణిస్తే..మీకు టికెట్ ధర 10 శాతం తగ్గుతుందని తెలంగాణ ఆర్టీసీ చెబుతోంది. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా దానిపై కూడా పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది తెలంగాణ ఆర్టీసీ. లహరితో పోల్చితే సూపర్ లగ్జరీ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఈ ఆఫర్ ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకు రాజధాని ఏసీ బస్సుల్లో ప్రయాణించినట్లయితే..టికెట్ ధరపై 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఇప్పుడు ఎండలు భగ్గుమంటున్నాయి. అందువల్ల చాలా మంది ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారికి ఈ ఆఫర్ బాగా నచ్చుతుందని ఆర్టీసీ చెబుతోంది.
లహరి బస్సుల్లో నాన్ ఏసీ అయినా స్లీపర్ కమ్ సీటర్ ఉంది. స్లీపర్ కావాలనుకునేవారు వాటిని సెలక్ట్ చేసుకోవచ్చు. ఇంట్ల పడుకున్నట్లుగా హాయిగా బస్సులో పడుకుని ప్రయాణించవచ్చు. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరింది. టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని ఆర్టీసీ సూచించింది.
ఇటీవల ఏపీ సర్కార్ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చింది. పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది. ఆర్టీసీ బస్సు టికెట్ బుకింగ్ కూడా వాట్సాప్ ద్వారానే లభిస్తోంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత టికెట్ వివరాలు కూడా వాట్సాప్ కే వస్తున్నాయి. అందువల్ల ప్రజలు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్ల టికెట్లు బుక్ చేసుకుంటారు. అందుకే వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ ఈ డిస్కౌంట్ ఆఫర్లు తెచ్చినట్లు తెలుస్తోంది.