Chevella Road Accident: ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలి.. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో అంతులేని శోకం!
Chevella Road Accident: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా, తాండూరు పట్టణంలోని ఒక నిరుపేద కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.
Chevella Road Accident: ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలి.. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో అంతులేని శోకం!
Chevella Road Accident: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా, తాండూరు పట్టణంలోని ఒక నిరుపేద కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తాండూరులోని గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ, తన నలుగురు కూతుళ్లను చదివించుకుంటున్నారు.
ఈ విషాదకర ఘటనలో ఎల్లయ్య గౌడ్ యొక్క ముగ్గురు అవివాహిత కుమార్తెలు – తనూష, సాయి ప్రియ, మరియు నందిని దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో చదువుతున్న ఈ అక్కాచెల్లెళ్లు ముగ్గురూ కలిసి గత నెల 15న జరిగిన ఓ పెళ్లివేడుకలో ఆనందంగా గడిపారు. అయితే, నేడు జరిగిన రోడ్డు ప్రమాదం వారి జీవితాలను అకస్మాత్తుగా ముగించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకుని తమ కూతుళ్ల మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదించారు.
ఎల్లయ్యగౌడ్‌కు నలుగురు కుమార్తెలు కాగా, ఒక కుమార్తెకు వివాహమైంది. మిగిలిన ముగ్గురు కుమార్తెలు ఒకేసారి కన్నుమూయడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. తాండూరులో ఆ కుటుంబానికి చెందిన బంధువులు, స్థానికులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.