Cyclone Montha: తెలంగాణలోని 16 జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' ముప్పు
Telangana Rains: బంగాళాఖాతంలో తీరం దాటిన మొంథా తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Cyclone Montha: తెలంగాణలోని 16 జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' ముప్పు
Telangana Rains: బంగాళాఖాతంలో తీరం దాటిన మొంథా తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఆకస్మిక వరద (Flash Flood) ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రత్యేకంగా పేర్కొంది.
ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్న జిల్లాలు:
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లితో పాటు మరో జిల్లాలో ఈ ఆకస్మిక వరద ప్రమాదం పొంచి ఉంది.
రెడ్ అలర్ట్ జారీ:
అంతేకాకుండా, వర్షాల తీవ్రత దృష్ట్యా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.