Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ ఓఎస్డీని ప్రశ్నించిన సిట్‌

Phone Tapping Case: రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Update: 2025-11-27 10:01 GMT

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ ఓఎస్డీని ప్రశ్నించిన సిట్‌

Phone Tapping Case: రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా, ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్‌క్లోజ్ చేశారు.

ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయినప్పటికీ ఆయన సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదని, అరెస్ట్ నుంచి మినహాయింపు ఆర్డర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతోంది.

Tags:    

Similar News