Telangana Panchayat Polls: బాండ్ పేపర్‌తో పిట్లం సర్పంచ్‌ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Telangana Panchayat Polls: తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ.. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో ఓ సర్పంచ్‌ అభ్యర్థి బాండ్‌ పేపర్‌తో ప్రచారం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Update: 2025-12-09 07:29 GMT

Telangana Panchayat Polls: బాండ్ పేపర్‌తో పిట్లం సర్పంచ్‌ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Telangana Panchayat Polls: తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ.. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో ఓ సర్పంచ్‌ అభ్యర్థి బాండ్‌ పేపర్‌తో ప్రచారం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిట్లం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నవాబ్‌ సుదర్శన్‌ గౌడ్‌ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో తాను ఓ బాండ్‌ పేపర్‌తో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత.. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ పిట్లంలోని అంబేద్కర్‌ విగ్రహానికి బాండ్‌ పేపర్‌ను అందజేశారు.

తన మాట, హామీల పరిరక్షణ పట్ల ప్రజల ముందే ప్రమాణం చేస్తున్నానని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, పంచాయతీ పనుల్లో ప్రజా భాగస్వామ్యం పెంపు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా తీసుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని అంటున్నారు పిట్లం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నవాబ్‌ సుదర్శన్‌ గౌడ్‌.

Tags:    

Similar News