తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన తొలిదశ పంచాయతీ పోలింగ్.. కాసేపట్లో కౌంటింగ్
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూలైన్‌లో నిలబడిన ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలకు మరియు 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, ఫలితాల కోసం అధికారులు రంగం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియను చేపట్టనున్నారు.
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే, ఎన్నికైన వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి, అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తారు. దీంతో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ నేడు పూర్తవుతుంది.