తెలంగాణలో మోగనున్న పంచాయతీ ఎన్నికల నగారా
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. కాసేపట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తెలంగాణలో మోగనున్న పంచాయతీ ఎన్నికల నగారా
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. కాసేపట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. తెలంగాణలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12 వేల 760 పంచాయతీలు, లక్షా 13 వేల 534 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వగా.. పంచాయతీరాజ్‌శాఖ, ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి. సాయంత్రం 6గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరాలు వెల్లడించనున్నారు.
పాత రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు వెల్లడించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఇప్పటికే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు నివేదిక సమర్పించింది. దీనిపై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. కాగా... ఇప్పటికే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సమర్పించగా.. వాటిని ప్రభుత్వం పరిశీలించింది.