New Ration Cards: తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ
New Ration Cards: రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తీపి కబురు.
New Ration Cards: తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ
New Ration Cards: రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తీపి కబురు. చివరకు వారి కల నెరవేరబోతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శుభారంభం చేయనున్నారు.
తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సీఎం 11 మంది లబ్ధిదారులకు కార్డులను అందించి, అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల మంది లబ్ధిదారులకు కొత్త కార్డులు అందనున్నాయి. ఈ వేడుకను నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామేల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా 80 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.