మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Update: 2020-01-07 15:49 GMT
EC Nagireddy File Photo

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈసీ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు . ఈ నెల 8 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే నామినేషన్ల పరిశీలన జనవరి 11 ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ జనవరి 14 ఉంటుంది. ఈ నెల 22 ఎన్నికలు జరుతాయి. అలాగే ఈ నెల 25వ తేది ఫలితాలు వెలువడనున్నాయి.

అంతకు ముందు మున్సిపల్ ఎన్నికల నిర్వహనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై ఉత్తమ్ పిటిషన్ సహా ఇతర అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్, వనపర్తి మున్సిపాల్టీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బేంచ్ స్టే ఇచ్చింది. దీంతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ లోని 3, 24, 25 డివిజన్లపై కూడా స్టే విధించింది. రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా జరగలేదని హైకోర్టు సింగిల్ బేంచ్ స్టే ఇచ్చింది. దీంతో ‎ఎన్నికల సంగం నోటివికేషన్ ఇచ్చింది. 

Tags:    

Similar News