Telangana Ministers: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ప్రమాణస్వీకారం.. ప్రత్యక్ష ప్రసారం..
Telangana Ministers: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ప్రమాణస్వీకారం.. ప్రత్యక్ష ప్రసారం..
Telangana Ministers: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ప్రమాణస్వీకారం.. ప్రత్యక్ష ప్రసారం..
Telangana: సీఎం రేవంత్ రెడ్డి టీం రెడీ అయింది. రేవంత్ సహా...12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎంగా రేవంత్ పగ్గాలు చేపడితే.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. సీనియార్టిటీతో పాటు జిల్లాలు, సామాజిక అంశాలను లెక్కలోకి తీసుకుని కేబినెట్‌లో చోటు కల్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కింది. మధిర ఎమ్మెల్యే, ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందిన భట్టికి.. డిప్యూటీగా అవకాశం కల్పించారు. అలాగే పాలేరు ఎమ్మెల్యే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించారు. ఖమ్మం నుంచి గెలిచిన, కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వర్ రావుకు కూడా రేవంత్ మంత్రివర్గంలో చోటు దక్కింది.
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలుగా ఉన్న... వైఎస్సార్ హయాంలోనూ మంత్రులుగా పని చేసిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సీనియర్ నేత ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన, ఆందోల్ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మంథని ఎమ్మెల్యే, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు... బీసీ సామాజిక వర్గానికి చెందిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణం చేశారు. మహిళా కోటలో తొలి కేబినెట్‌లో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇద్దరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. ములుగు ఎమ్మెల్యే, ఆదివాసీ బిడ్డ సీతక్కకు మంత్రిగా చోటు దక్కింది. అలాగే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, బీసీ మహిళాగా... కొండా సురేఖ మంత్రిగా ప్రమాణం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం
మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం
మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రమాణ స్వీకారం
మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం
మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం
మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం
మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం
మంత్రిగా కొండా సురేఖ ప్రమాణ స్వీకారం
మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం