మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య ముగిసిన వివాదం
మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం ముగిసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చారు.
మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం ముగిసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చారు. సామాజిక న్యాయానికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అన్న పొన్నం ప్రభాకర్.. తనకు అడ్లూరిపై ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. పార్టీ సంక్షేమం తప్ప తనకు మరేదీ ముఖ్యం కాదన్నారు. తాను అనని మాటను అన్నట్టు వక్రీకరించడంతో అడ్లూరి బాధపడ్డారని.. అందుకే తాను క్షమాపణ కోరుతున్నానని అన్నారు పొన్నం.