Harish rao Inagurates Kashayam Center in Siddipet: కషాయం తాగండి.. కరోనాను జయించండి : మంత్రి హరీష్ రావు

Harish rao Inagurates Kashayam Center in Siddipet: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌, మెగా కంపెనీ సహకారంతో కషాయ వితరణ కేంద్రాన్ని

Update: 2020-07-25 15:27 GMT
Harish Rao ( File photo)

Harish rao Inagurates Kashayam Center in Siddipet: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌, మెగా కంపెనీ సహకారంతో కషాయ వితరణ కేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కషాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిద్దిపేటకు వచ్చే ప్రజల కోసం 3 వేడినీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. వేడినీరు, కషాయం తాగితే కరోనా నుంచి బయటపడొచ్చు అని అన్నారు.

ఇక కరోనా సమయంలో ప్రజలెవరూ బయటకు రాకూడదని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అన్నారు. ఇక ఎవరికీ వారే స్వీయ నియంత్రణ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇక ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలని అన్నారు. కషాయం తాగండి.. కరోనాను జయించండి.. ప్రభుత్వానికి సహకరించి మిమ్మిల్ని మీరు రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో 100 పడకల కొవిడ్ ఆస్పత్రి, గజ్వేల్ ఆర్వీఏం ఆసుపత్రిలో వంద పడకలు, సంగారెడ్డి ఏఎన్ఎం ఆసుపత్రిలో 100 పడకలతో కరోనా చికిత్స జరుగుతోందని ఈ సందర్భంగా హరీష్ రావు వెల్లడించారు.

ఇక అటు తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,640 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 52,466 కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 11,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 40,334 కి చేరుకుంది. ఇక ఇవ్వాలా ఎనమిది మంది కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 455 కి చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 15,367 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 3,37, 771కి చేరుకుంది.

Tags:    

Similar News