ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : మంత్రి హరీష్‌రావు
చింతమడకలోని ప్రతీ కుటుంబం స్వయం సమృద్ధి సాధించేందుకు సహకరిస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
చింతమడకలోని ప్రతీ కుటుంబం స్వయం సమృద్ధి సాధించేందుకు సహకరిస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ సొంతగ్రామం చింతమడక వాసుల కళ సాకారమవుతోంది. ఈ మేరకు మంత్రి హరీష్‌రావు చింతమడక గ్రామంలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధిపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పౌల్ట్రీ, డైరీ షెడ్ల నిర్మాణానికి రెండు లక్షల ఆర్థిక సహాకారం అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని 22 మందికి డైరీ యూనిట్లకు చెక్కులు అందించారు. 87 మందికి పౌల్ట్రీ యూనిట్లుకు చెక్కులు అందాయి. 15 రోజుల్లో షెడ్లు నిర్మించాలన్నారు. షేడ్ల నిర్మాణం పూర్తికాగానే పశువులను, కోళ్లను అందిస్తామని హరీశ్ రావు అన్నారు.