Mahesh Kumar Goud: స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లను పెంచి చరిత్ర సృష్టించాం

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్ల పెంపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.

Update: 2025-10-09 08:52 GMT

Mahesh Kumar Goud: స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లను పెంచి చరిత్ర సృష్టించాం

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్ల పెంపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులతో జూమ్‌లో సమావేశమైన మహేష్ గౌడ్.. స్థానిక ఎన్నికల ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలలో నామినేషన్లు ప్రారంభం అయ్యాయని.. నామినేషన్ల విషయంలో పార్టీ శ్రేణులు సీరియస్‌గా వ్యవహరించాలని తెలిపారు. ఇక ఓట్‌ చోరీ సంతకాల సేకరణ విషయంలోనూ... అక్టోబరు 15 నాటికి పూర్తిచేసి ఏఐసీసీకి పంపేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు ప్రత్యేక శ్రద్ధ తీస్కొని సంతకాల సేకరణ పూర్తి చేయాలన్నారు.

Tags:    

Similar News