మీ సేవలో ఫేక్ సర్టిఫికెట్ డ్రామా.. ఎన్నికల హడావుడిలో సంతకం చేశానన్న తహశీల్దార్!

తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్‌లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నామిషన్ల పర్వంలో అధికారుల తప్పిదాలు బయటికి వస్తున్నాయి.

Update: 2025-12-09 11:07 GMT

మీ సేవలో ఫేక్ సర్టిఫికెట్ డ్రామా.. ఎన్నికల హడావుడిలో సంతకం చేశానన్న తహశీల్దార్!

తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్‌లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నామిషన్ల పర్వంలో అధికారుల తప్పిదాలు బయటికి వస్తున్నాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తప్పుడు కుల సర్టిఫికెట్‌ వ్యవహారం కలకలం రేపింది.

కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ అభ్యర్థిగా అక్తర్ బేగమ్ బీసీడి మాలీ కులం సర్టిఫికెట్ ఇచ్చింది. ముస్లిం మహిళకు బీసీ ఈ ముస్లిం అని ఉండాలి. దీంతో ఆమెను అధికారులు తిప్పి పంపించారు. గంట వ్యవధిలో ఆ మహిళ బీసీఈ సర్టిఫికెట్‌తో నామినేషన్ వేయడానికి వచ్చింది. ఇంత తొందరగా కులం సర్టిఫికెట్ రావడంపై అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

సర్టిఫికెట్‌పై అధికారులు విచారణ చేపట్టారు. మీసేవలో బీసీ డీగా తప్పుడు అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. కాగజ్ నగర్ తాహశీల్దార్ మధుకూర్ ఆ సర్టిఫికెట్ జారీ చేశారు. ముస్లిం పేరు ఉన్నా చూడకుండా మాలి కులం సర్టిఫికెట్ ఇచ్చారు. నామినేషన్ వేయకుండా ఆ మహిళ మీ సేవ వద్దకు వెళ్లింది. మీసేవ నిర్వాహకుడు ఫేక్ సర్టిఫికెట్ బీసీ అని వెంటనే తయారు చేసి ఇచ్చాడు. ఎన్నికల్లో బిజీగా ఉండటంతో చూడకుండా సంతకం చేశామని కాగజ్ నగర్ ఎమ్మార్వో మధుకర్ వివరణ ఇచ్చారు. మీసేవ కేంద్రాలతో అధికారులు కుమ్మక్కై తప్పుడు కులం సర్టిఫికెట్లు జారీ చేస్తన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News