Telangana Local Body Polls: 'ఈ రాత్రే జాబితా సిద్ధం చేయాలి': స్థానిక పోరుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Revanth Reddy: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహంపై వేగం పెంచారు.

Update: 2025-10-09 07:20 GMT

Telangana Local Body Polls: 'ఈ రాత్రే జాబితా సిద్ధం చేయాలి': స్థానిక పోరుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Revanth Reddy: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహంపై వేగం పెంచారు. స్థానిక ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే ఏ అడ్డంకినైనా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

పార్టీ నేతలతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "తొలి విడత ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితా ఈ రాత్రికి సిద్ధం కావాలి," అని కచ్చితమైన ఆదేశం జారీ చేశారు.

అలాగే, ఇన్‌ఛార్జి మంత్రులు వెంటనే ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలని, వారికి నామినేషన్లకు అవసరమైన బీ-ఫారంతో పాటు నో డ్యూ పత్రాలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు కేసును పీసీసీ చీఫ్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.

Tags:    

Similar News