కాసేపట్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌..?

ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌‌ను ఎన్నికల కమీషన్ విడుదల చేయనుంది.

Update: 2025-10-09 05:28 GMT

Telangana Local Body Polls 2025 Notification: ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌‌ను ఎన్నికల కమీషన్ విడుదల చేయనుంది. తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై నేడు మరికొన్ని వాదనలు ఏజీ సింఘ్వీ వినిపించనున్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వకుండా చూడాలని, నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. అయితే.. ఎన్నికల ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మరికాసేపట్లో యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఎన్నికల కమీషన్ విడుదల చేయనుంది. ‎

తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. ఉదయం పదిన్నర గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లకు అవకాశం కల్పించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్లను స్వీకరించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. అక్టోబర్ 23న తొలివిడత పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Tags:    

Similar News