Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

Update: 2025-10-09 06:57 GMT

Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఎలాంటి స్టే విధించకపోవడంతో.. షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి విడతలో ఎన్నికలు జరిగే MPTC, ZPTC స్థానాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జిల్లాల వారీగా అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. తొలి విడతలో ఎన్నికలు జరిగే చోట్ల MPTC, ZPTC అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్‌లో 31 జిల్లాల్లోని 53 రెవెన్యూ డివిజన్లలో 292 జడ్పీటీసీలు, 2వేల 963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా... అక్టోబర్ 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అప్పీల్‌కు చివరి తేదీ అక్టోబర్ 13గా ఉంది. అక్టోబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 15వ తేదీనే ప్రకటించనున్నారు. అక్టోబర్ 23 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 11 ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News