Telangana Liberation Day: బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
Telangana Liberation Day: ఇవాళ తెలంగాణ గర్వించ దగిన దినోత్సవమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు.
Telangana Liberation Day: ఇవాళ తెలంగాణ గర్వించ దగిన దినోత్సవమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రామచంద్రరావు పాల్గొన్నారు. సర్దార్ వల్లబాయి పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఎంతో మంది పోరాడి..ఎంతో మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గడిచిన మూడేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.