Bandi Sanjay: ఎంఐఎంకి భయపడి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారు
Telangana Liberation Day: సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Telangana Liberation Day: సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరముంది. రజాకార్ల దళం సృష్టించిన పార్టీయే ఎంఐఎం. ఆ పార్టీకి భయపడి ఓ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. విమోచన దినోత్సవం పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు.