Telangana: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై స్పష్టత ఇచ్చిన బోర్డు
Telangana Inter Practical Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.
Telangana: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై స్పష్టత ఇచ్చిన బోర్డు
Telangana Inter Practical Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. సీనియర్ ఇంటర్ విద్యార్థులకు తప్పనిసరిగా ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే ఆలోచన లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఒకటి, రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. వార్షిక పరీక్షలు కూడా యథాతథంగా కొనసాగుతాయని విద్యార్థులు ఎలాంటి ఆయోమయానికి గురికావొద్దని ఇంటర్ బోర్డు తెలిపింది.