Mahmood Aali Recovered from Covid19: కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ

Mahmood Aali Recovered from Covid19: తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Update: 2020-07-03 13:30 GMT
Mahmood ali (file photo)

Mahmood Aali Recovered from Covid19: తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. ఆయనతో పాటు తన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడిన ఆయన కుటుంబ సభ్యులకు, ఆయనకు కాగా వైద్యులు అందించిన చికిత్సతో క‌రోనా నుంచి కోలుకొని శుక్ర‌వారం డిశ్చార్జ్ అయ్యారు. కాగా హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా సోకకముందే స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌తో ఉండ‌టంతో కుటుంబ‌ స‌భ్యులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మహమూద్‌ అలీని ఆస్పత్రికి త‌రలించారు. కాగా ఇవాళ కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇక ఆయన అభిమానులు, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు చేసిన ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, గ‌ణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, డిప్యూటీ స్పీక‌ర్ టి.ప‌ద్మారావు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలి‌సిందే.

ఇక పోతే తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,213 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇందులో 9, 226 యాక్టివ్ కేసులు ఉండగా, 9,069మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్న ఎనమిది మంది మృతి చెందారు. నిన్న నమోదైన 1,213 కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 998 కేసులు నమోదు అయ్యాయి. ఇక మిగతా ప్రాంతాలలో చూసుకుంటే రంగారెడ్డిలో 48, మేడ్చెల్ 54, సంగారేడ్డి, మహబూబ్ నగర్ , భద్రాది కొట్టేగుడెం లలో చెరో 7 , కరీంనగర్, మహుబుబాబాద్ , నిజామాబాదు లలో చెరో 5, సూర్యాపేట లో 4, ఖమ్మం 18, నల్గొండ 8, కామారెడ్డి 2, ములుగు 4, వరంగల్ రూరల్ 10, జగిత్యాల్, నిర్మల్ లలో చెరో 4, వరంగల్ అర్బన్ 09, నారాయణపేట 2, సిరిసిల్లా 06, నాగూర్ కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్, గద్వాల్, మెదక్, యదాద్రిలో ఒక్కో కేసు నమోదు అయింది.

ఇక ఇందులో ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది..నిన్న తెలంగాణ ప్రభుత్వం కంటోన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇక భారత్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి.. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కేసులు నమోదు కాగా, 434 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,26,947 ఉండగా, 3,59,859 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు.

Tags:    

Similar News