Telangana High Court: గ్రూప్-1 అప్పీల్ పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ
Telangana High Court: గ్రూప్-1 మెయిన్ పరీక్ష పేర్లను తిరిగి మూల్యంకనం చేయాలని..
Telangana High Court: గ్రూప్-1 మెయిన్ పరీక్ష పేర్లను తిరిగి మూల్యంకనం చేయాలని.. లేనట్లయితే తిరిగి పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించనున్నది. అవకతవకలు జరిగాయని చెప్పి మొత్తం ఎంపికను రద్దు చేయడం చెల్లదని పరీక్షల్లో అర్హత పొందిన అబ్యర్దులు అప్పీలు దాఖలు చేశారు.
తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలే తప్ప..అర్హత పొందిన అబ్యర్ధులకు శిక్ష విధింపు చెల్లన్నారు. సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ దాఖలైన అప్పీల్ ను ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై మరో అప్పీలు దాఖలు అయ్యింది. రెండు అప్పీళ్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.