TS High Court: ఎమ్మెల్సీ నియామకాలపై తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు

TS High Court: దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణకు హైకోర్టులో ఊరట

Update: 2024-03-07 06:32 GMT

TS High Court: ఎమ్మెల్సీ నియామకాలపై తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు

TS High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదంలో కోర్టుకెళ్లిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని తీర్పునిచ్చింది. అలాగే కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని కోర్టు తెలిపింది.

కాగా గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎన్నుకుంది. కానీ వారికి రాజకీయంగా అనుబంధం ఉందంటూ గవర్నర్ ప్రభుత్వ వినతిని తోసిపుచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోదండరామ్, అమిర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమించారు. దీనిపై దాసోజు శ్రావన్, కుర్రా సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. ప్రొఫెసర్ కోందడరామ్ ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఉండి ఆయనను ఎలా ఎమ్మెల్సీగా ప్రకటిస్తారని దాసోజు శ్రావణ్‌ తమ వాదనలను వినిపించాడు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఎమ్మెల్సీల నియామకాలను కొత్తగా చేపట్టాలని తీర్పునిచ్చింది.

Tags:    

Similar News