Gongidi Sunitha: ఆలేరు MLA గొంగిడి సునీతకు హైకోర్టు జరిమానా
Gongidi Sunitha: 2018కి చెందిన కేసులో ఇప్పటి వరకూ.. కౌంటర్ పిటీషన్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
Gongidi Sunitha: ఆలేరు MLA గొంగిడి సునీతకు హైకోర్టు జరిమానా
Gongidi Sunitha: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018కి చెందిన కేసులో ఇప్పటి వరకూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేయకపోవడంపై కోర్టు సీరియస్ అయ్యింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. గొంగిడి సునీతకు 10 వేల రూపాయల జరిమానా విధించింది. అక్టోబరు 3లోపు కౌంటర్ దాఖలు చేయాలని.. లేని పక్షంలో కౌంటర్ దాఖలుకు అవకాశం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.