Group-1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు
Group-1: గ్రూప్-1 మెయిన్ పరీక్ష పేర్లను తిరిగి మూల్యంకనం చేయాలని.. లేనట్లయితే తిరిగి పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా పడింది.
Group-1: గ్రూప్-1 మెయిన్ పరీక్ష పేర్లను తిరిగి మూల్యంకనం చేయాలని.. లేనట్లయితే తిరిగి పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా పడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టులలో పిటిషన్ దాఖలు చేసింది. మార్చి పదో తేదీన విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయాని పలువురు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సికింగ్ బేంచ్ జస్టిస్ రాజైశ్వర్ రావు కీలక తీర్పు ఇచ్చారు. ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేశారు.
ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వాదనలను సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఫలితాలు సక్రమంగానే ఉన్నాయని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలులోకి వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాదించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది హైకోర్టు.