ఆరు దాటితే..ఆర్టీసీ ఉద్యోగులు కారు..అర్హత కలిగిన వారికి ఆర్టీసీలో..

Update: 2019-10-05 09:50 GMT

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరులోపు డ్యూటిలో చేరకపోతే చర్యలు తప్పవని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు. ఆరుగంటల లోపు విధులకు హాజరైన వారే ఆర్టీసీ ఉద్యోగులని మిగిలిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులుగా గుర్తించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు. నాలుగు వేల బస్సులను అద్దెకు తీసుకుంటున్నట్టు తెలియజేసిన మంత్రి అర్హత కలిగిన వారికి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నామన్నారు. ప్రయివేటు బస్సులకు రూట్ పర్మిట్లు జారీ చేస్తున్నట్టు తెలియజేశారు.   

Tags:    

Similar News