Hyderabad: బంజారాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్‌పై టాస్క్ ఫోర్స్ దాడులు

Hyderabad: నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ నడుపుతున్నట్లు గుర్తింపు

Update: 2024-05-05 03:19 GMT

Hyderabad: బంజారాహిల్స్ ఆప్టర్ 9 పబ్‌పై టాస్క్ ఫోర్స్ దాడులు

Hyderabad: హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తున్నట్లు వారు గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించడానికి ఇతర రాష్ర్టాల నుండి యువతులను తీసుకువచ్చి పబ్‌లో అసభ్యకరమైన డాన్సులను చేయిస్తున్నారు నిర్వాహకులు. సదరు యువతి, యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు...స్టేషన్‌కు తరలించారు. ఎలక్షన్ కోడ్ ఉన్నా అర్థరాత్రి వరకు బార్, పబ్‌ నిర్వహణపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. పబ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News