Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్‌లో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్
Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయి నన్ను ఓడించే కుట్ర చేస్తున్నాయి
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్‌లో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్‌పై కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. వారితో మంత్రి పొన్నం ప్రభాకర్ కుమ్మక్కు అయ్యారని పరోక్ష ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కలిసి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో వచ్చిన డబ్బుతో ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారన్నారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సైతం ఆ డబ్బుతోనే కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలపై నిలదీస్తున్నందుకే మంత్రి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు బండి సంజయ్.