Rahul Gandhi: తెలంగాణపై ఫోకస్.. నిర్మల్‌లో జరగనున్న ప్రచార సభలో పాల్గొననున్న రాహుల్
Rahul Gandhi: రాహుల్‌తో పాటు సభకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
Rahul Gandhi: తెలంగాణపై ఫోకస్.. నిర్మల్‌లో జరగనున్న ప్రచార సభలో పాల్గొననున్న రాహుల్
Rahul Gandhi: తెలంగాణపై ఫోకస్ పెంచిన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రచారంలో మరింత జోష్ పెంచడానికి సిద్ధమైంది. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాసేపట్లో నాంధేడ్ నుంచి నేరుగా నిర్మల్‌లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అక్కడ అదిలాబాద్ అభ్యర్ధి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ప్రచారసభలో సీఎం రేవంత్ కూడా పాల్గొననున్నారు. నిర్మల్‌లో జరగనున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. భారీగా జనసమీకరణ చేపట్టింది.