ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసిన రూ.1500 మీకు వచ్చాయో లేదో ఇలా చెక్ చేసుకోండి...

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1,500 చొప్పున అకౌంట్లలో జమ చేస్తోంది.

Update: 2020-04-18 10:11 GMT

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1,500 చొప్పున అకౌంట్లలో జమ చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 14లక్షల అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలయి చాలా మంది అకౌంట్లలో నగదు జమ అయినప్పటికీ కొంత మందికి తమ అకౌంట్లలో నగదు జమ అవుతుందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. అసలు తామకు నగదు వస్తుందా, నగదు పొందే లబ్ధిదారుల జాబితాలో తాము ఉన్నామా లేదా అని సందేహాలు వస్తున్నాయి.

అలాంటి సందేహాలు ఉన్న వారు ఈ విధంగా తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాని కోసం తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

అది ఓపెన్ చేయగానే ఆ పేజీకి ఎడమవైపు ఉన్న జాబితాలో DBT Response Status Check పైన క్లిక్ చేయండి.

వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

ఆ పేజీలో మీకు సంబంధించిన రేషన్ కార్డ్ లేదా యూఐడీ లేదా మొబైల్ నెంబర్‌ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

ఆ తరువాత ఎంచుకున్నఆప్షన్ ప్రకారం నెంబర్ ఎంటర్ చేయాలి.

తదుపరి Get Details పైన క్లిక్ చేయాలి.

అప్పుడు వెంటనే మీకు కావలసినవి పూర్తివివరాలు స్క్రీన్ పైన వస్తాయి.

ఒకవేళ Data Not Found అని వస్తే మిగతా రెండు ఆప్షన్స్‌తో ట్రై చేయండి.

Tags:    

Similar News