Telangana: రాష్ట్రంలో ఏడుగురు సివిల్ సర్వెంట్ల బదిలీ
Telangana: సివిల్ సప్లై కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్
Telangana: రాష్ట్రంలో ఏడుగురు సివిల్ సర్వెంట్ల బదిలీ
Telangana: తెలంగాణలో అధికారుల బదిలీలపర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్, ఇంటర్ విద్య డైరెక్టర్‌గా శృతి ఓఝా, గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డి, సివిల్ సప్లై కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికెరిపై బదిలీవేటు పడింది. ఆమెకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతం పొత్రుని నియమించారు.