Osmania Hospital Sealed: ఉస్మానియా పాత భవనానికి సీల్‌..సర్కార్ ఆదేశం

Osmania Hospital Sealed: శిధిలావస్ధకు చేరుకున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనాన్ని వెంట‌నే ఖాళీ చేసి సీల్ వేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డిఎంఇ) డాక్టర్ కె. రమేష్ రెడ్డి ఆదేశించారు.

Update: 2020-07-22 13:07 GMT

Osmania Hospital Sealed: శిధిలావస్ధకు చేరుకున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనాన్ని వెంట‌నే ఖాళీ చేసి సీల్ వేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డిఎంఇ) డాక్టర్ కె. రమేష్ రెడ్డి ఆదేశించారు. పాత భవంతిలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర వార్డుల్లోకి తరలించాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేప‌థ్యంలో రాష్ర్ట వైద్యాధికారులు పాత భ‌వ‌నాన్నిఖాళీ చేశారు. పాత భవంతి ప్రమాదకర స్థితిలో ఉండడంతో అందులో ఎలాంటి వైద్య కార్యకలాపాలు నిర్వహించకూడదని అధికారులు ఆదేశించారు.

కొద్ది రోజుల క్రితం నగరంలో కురిసిన చిన్నపాటి వర్షానికే ఆస్పత్రిలో ఉన్న వార్డుల్లోకి మురికి నీటితో నిండిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు నీటిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింది. ఇదే అదునుగా భావించిన విపక్షాలు కూడా వార్డుల్లోకి నీరు చేరడాన్ని బాగా ఎత్తిచూపాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇతర నాయకులంతా ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. నెటిజన్లు సైతం సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్ చేశారు.

దీంతో ఇది పెద్ద చర్చకే దారి తీసింది. మళ్లీ భారీ వర్షాలు పడితే, ఇంకేదైనా ప్రమాదం జరిగే అవకాశమూ లేకపోలేదు. నిజానికి ఉస్మానియా ఆస్పత్రిని పూర్తిగా పడగొట్టి కొత్త ఆస్పత్రి నిర్మిస్తామని 2015లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. పాత భవనం మొత్తం ఖాళీ చేసి, సీల్ వేయాల్సిందగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం తాజాగా పాత భవనం మొత్తం తక్షణం ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ, అప్పుడు విపక్షాల ఎదురుదాడి కారణంగానే కొత్త ఆస్పత్రి నిర్మించలేదని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.



Tags:    

Similar News