తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించినా.. వీటికి మినహాయింపులు వర్తిస్తాయి
రాష్ట్రంలో కేసుల సంఖ్య 858 నమోదయ్యాయి. 18 మంది ఈ మహమ్మారి బారినపడి మరణించారు.
రాష్ట్రంలో కేసుల సంఖ్య 858 నమోదయ్యాయి. 18 మంది ఈ మహమ్మారి బారినపడి మరణించారు. హైద్రాబాద్ లోని అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యలోనే కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో సోమవారం నుంచి ఎలాంటి సడలింపులు ఉండబోవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే నెల 7 తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో వైరస్ ప్రభావం ఎక్కువగా వుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే యథాతథంగా ఉంటాయన్నారు. మే 5న మరోసారి మంత్రి వర్గ సమావేశం ఉటుందని, అప్పటి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 1897 అంటువ్యాధుల విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారలే రాష్ట్ర ప్రభుత్వానికీ ఉంటాయని, దీని ప్రకారమే పొడిగింపు నిర్ణయాన్ని మంత్రిమండలి తీసుకుందని తెలిపారు. ఆదివారం రాష్ట్రమంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డితో కలిసి సీఎం మిడియాతో మాట్లాడారు. పలు అంశాలను వెల్లడించారు.
మే 7 వరకు విమానాల ద్వారా హైదరాబాద్ రావద్దని కోరారు. కరోనా పోరాటంలో ప్రజాప్రతినిధులు సర్పంచులు, కార్పొరేటర్లు, పంచాయతీ సిబ్బంది, కార్మికులు అద్భుతంగా పనిచేస్తున్నారు. సంస్థల, దాతల దాతృత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని కేసీఆర్ అన్నారు.
♦ రాష్ట్రంలో కిరాణా దుకాణాలు, కూరగాయల షాపులు తెరిచి ఉంటాయి.
♦ బియ్యం, నూనె మిల్లులు శానిటైజర్ల తయారీ, ఫార్మా కంపెనీలు పనిచేస్తాయన్నారు.
♦ ఆన్‌లైన్లో, ఈ కామర్స్ సంస్థలకు అనుమతి లేదు.
♦ మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాల కోత కొనసాగుతుంది
♦ వైద్యఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రోత్సాహకం ఉంటాయి.
♦ పోలీసు సిబ్బందికి అదనంగా 10శాతం వేతనం
♦ విద్యుత్ నిర్వహణ సిబ్బంది, కార్మికులకు యథాతథంగా వేతనాలు
♦ పెన్షనర్లకు 25 శాతం కోత
♦ మే నెలలో పేదలు ఒకొక్కరికి రూ. 12 కిలోల బియ్యం
♦ కార్డు ఒక్కింటికి రూ.1,500 సాయం కొనసాగుతుంది వలసకార్మికులకూ సాయం కొనసాగుతుది.
♦ ఆస్తిపన్ను చెల్లింపునకు గడువు మే నెలాఖరు వరకు పోడిగింపు
♦ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి.
♦ రాష్ట్రంలో 1.11 లక్షల మందికి ఫ్యామిలీ పింఛన్లు వస్తున్నాయి
♦ పింఛనుదారులకు ఏప్రిల్ నెలకు 75 శాతం చెల్లింపు
♦ వైద్య, మున్సిపల్, వాటర్‌వర్క్స్, పారిశుద్ధ్య సిబ్బందికి ఏప్రిల్ నెలకు ప్రోత్సాహకలు
♦ విద్యుత్తుశాఖలో పనిచేస్తున్న 34,512 మంది నిర్వహణ సిబ్బంది, ఆర్టిజన్స్‌కు నూరుశాతం వేతనం
♦ 40 లక్షల మంది పేదలకు ఆసరా పింఛన్ల కింద ఒక్కొక్కరికి రూ.2016
♦ రాష్ట్రంలో ఇప్పుడే ఫంక్షన్లు, పెళ్లిళ్లకు అనుమతి
♦ స్విగ్గీ, జొమాటో సంస్థలను నిషేధి
♦ పండగలు, ప్రార్థనలు ఇళ్లలోనే
♦ ఇతర రాష్ట్రాల కూలీలకు గతంలో మాదిరి సహాయం అందుతుంది.
ఒక్కరే ఉంటే 12 కిలోల బియ్యం, రూ.500 నగదు.. కుటుంబం ఉంటే ఒక్కొక్కరికి 12 కిలోలు.. కుటుంబానికి రూ.1,500 ఇస్తాం. ప్రభుత్వం 21.5 లక్షల టన్నుల ఎరువుల సేకరణలో ఉంది. రైతులకు లోటు లేకుండా ఎరువులు సరఫరా చేస్తాం. మే 5 నుంచి కొనుగోలు చేసుకోవాలి. అప్పటికి 95 శాతం పంటల కొనుగోలు పూర్తవుతుంది. రాష్ట్రంలో ఫంక్షన్‌హాళ్లు చాలా ఉన్నాయి. ఎరువులు నిల్వచేయడానికి అన్ని ఫంక్షన్‌హాళ్లు సీజ్‌చేసి తాత్కాలిక గోదాములుగా మార్చేందుకు కలెక్టర్లకు అధికారాలిచ్చామనికేసీఆర్ తెలిపారు.